- బోర్ మోటర్ ఎత్తుకెళ్లిన దొంగలు
- కేబుల్, బట్టలనూ వదల్లేదు
- ఫలక్ నుమాలో ఘటన
ఓల్డ్‌సిటీ వెలుగు: పాతబస్తీ ఫలక్ నుమా దోబీ ఘాట్హిందూ స్మశానవాటికలో దొంగలు పడ్డారు. బుధవారం రాత్రి ఎవరూ లేని టైం చూసి బోరు మోటార్‌ను ఎత్తుకుపోయారు. అంతేగాకుండా బోరు కేబుల్, అక్కడున్న కొన్ని బట్టలను కూడా వదిలిపెట్టలేదు. పోతూ పోతూ స్మశానవాటికలో ఏదైనా సామగ్రి పెట్టుకునేందుకు ఉపయోగించే రూమ్‌లో ఏదైనా దొరుకుతుందేమోనని షట్టర్ధ్వంసం చేశారు.
దీనిపై దోబీ ఘట్ సంఘం అధ్యక్షుడు నరసింహా మాట్లాడుతూ గతంలో కూడా ఇలాగే దొంగలు పడ్డారని, అప్పుడు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పోయారన్నారు. స్మశానాలను కూడా వదలని ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఫలక్ నుమా ఎస్ఐ జావేద్ తెలిపారు.

