వరంగల్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బుధవారం డీఎస్పీగా ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందినవారిలో హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గొర్ల సీతారెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

