మీరు తక్కువ ధర ఉండి, పెట్రోల్ ఖర్చు తగ్గించే మంచి బైక్ కోసం చూస్తున్నారా..? అయితే 100-110cc బైక్‌లు మీకు కరెక్ట్ ఛాయిస్. ఈ రోజుల్లో పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో, లీటరుకు 70 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే జేబుకు చాలా రిలీఫ్ లభిస్తుంది. అయితే రూ. 60 వేలలోపు ధరలో మూడు బెస్ట్ బైక్స్ అప్షన్స్ గురించి మీకోసం....
1. టీవీఎస్ స్పోర్ట్
మీకు స్టైలిష్‌గా కనిపిస్తూ, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కావాలంటే టీవీఎస్ స్పోర్ట్ బెస్ట్ ఆప్షన్. దీని ధర సుమారు రూ. 55 వేల 500 నుండి మొదలవుతుంది. మైలేజ్ చూస్తే లీటరుకు 70 నుండి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ చాలా తేలికగా ఉంటుంది, కాబట్టి సిటీ ట్రాఫిక్‌లో నడపడం చాలా ఈజీ. దీని గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్ చూడటానికి చాలా స్పోర్టీగా ఉంటాయి. ఈ బైక్ కి 109.7cc ఇంజన్ ఉంది.
2. టీవీఎస్ రేడియాన్
చూడటానికి కొంచెం క్లాసీగా, ప్రీమియం లుక్‌తో ఉండే బైక్ కావాలనుకునే వారికీ టీవీఎస్ రేడియాన్ కొనొచ్చు. దీని ధర సుమారు రూ. 55 వేల 400 నుండి మొదలవుతుంది. ఇక మైలేజ్ చూస్తే లీటరుకు 65 నుండి 73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. క్రోమ్ ఫినిషింగ్, డ్యూయల్-టోన్ కలర్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ 109.7cc ఇంజన్ బైక్ మీ ప్రయాణాన్ని చాలా స్మూత్‌గా చేస్తుంది.
3. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచిన బైక్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్. దీని ధర సుమారు రూ. 55 వేల 992 నుండి మొదలవుతుంది. మైలేజ్ చూస్తే సుమారు 65-70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ బైక్ 97.2cc ఇంజన్ చాలా పటిష్టమైనది. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. హీరో కంపెనీకి చాలా సర్వీస్ సెంటర్లు ఉండటం వల్ల రిపేర్ లేదా సర్వీస్ చేయించుకోవడం చాలా సులభం.
ఈ బైక్‌లను ఎందుకు కొనాలంటే
ఇవి కొనడానికే కాదు, మెయింటైన్ చేయడానికి కూడా చాలా తక్కువ ఖర్చవుతాయి. భవిష్యత్తులో ఈ బైక్‌లను సెకండ్ హ్యాండ్‌లో అమ్మినా మంచి రేటు వస్తుంది. వీటి బరువు తక్కువగా ఉండటం వల్ల సిటీల్లోనూ, గ్రామాల్లోనూ డ్రైవింగ్ చేయడానికి చాలా ఈజీ, కంఫర్ట్ ఉంటుంది.
మీకు ఏది సెట్ అవుతుందంటే
స్పీడ్, స్టైల్.. కావాలంటే TVS Sport తీసుకోవచ్చు. కంఫర్ట్, ఫీచర్లు కావాలంటే TVS Radeon బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు. మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే Hero HF Deluxe కొనొచ్చు. ఈ మూడు బైక్‌లలో ఏది తీసుకున్నా, మీ బడ్జెట్‌లో అది ఒక మంచి ఛాయిస్ అవుతుంది. ఇదంతా మీరు దేనికి ఎక్కువ విలువ ఇస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

