మద్దూరు,వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణానికి చెందిన జంగెరి హరి కుమార్తెలు పూర్విక, శుభప్రియ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల మధ్య గవర్నమెంట్ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వీరు ర్యాంకులు సాధించారు.
పూర్విక 600కు 587 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలవగా, శుభప్రియ 600కు 571 మార్కులతో ఆరో స్థానం సాధించింది. బాలికల తల్లి మరణించగా.. తండ్రి హరి హైదరాబాద్లో డ్రైవర్‌గా పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. కార్పొరేట్ స్కూల్‌లో చదవకపోయినా ప్రతిభ ఉంటే పేదరికం అడ్డుకాదని ఈ అక్కాచెల్లెళ్లు నిరూపించారు. వారిని విజయంపై హెచ్‌ఎం సరిత, ఉపాధ్యాయులు, గ్రామస్తులు శాలువాలతో సన్మానించి అభినందించారు.

