ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ టీచర్ బానోతు గౌతమి సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే స్వచ్ఛంద రాజీనామా ప్రకటించారు. ఆరు నెలలుగా పోస్టింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఆలస్యమైందనే మనస్తాపంతో రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.
అయితే, ఈ నిర్ణయంపై సహచర ఉపాధ్యాయులు, పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా కార్యకలాపాల కోసమే రాజీనామా చేశారనే ఆరోపణలతో పాటు, పోస్టింగ్ తీసుకున్న తర్వాత రాజీనామా చేయడం వెనుక సర్వీస్ బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశం ఉందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
