సంచలన విజయంతో రెండో రౌండ్‌లోకి కృష్ణ ప్రసాద్‌–పృథ్వీ జోడీ

సంచలన విజయంతో రెండో రౌండ్‌లోకి కృష్ణ ప్రసాద్‌–పృథ్వీ జోడీ

అసాన్‌‌‌‌‌‌‌‌ (కొరియా): ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్లు కృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌–పృథ్వీ కుమార్‌‌‌‌‌‌‌‌ జోడీ.. కొరియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–300 టోర్నీలో సంచలన విజయం సాధించారు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌–పృథ్వీ 21–16, 21–18తో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ చోలోమ్‌‌‌‌‌‌‌‌పోన్‌‌‌‌‌‌‌‌ చరోకింతమోర్న్‌‌‌‌‌‌‌‌–వరోపాల్‌‌‌‌‌‌‌‌ థోంగ్సానా (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు.

42 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ జోడీ బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలతో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో అచ్యుతాదిత్య రావు–అర్జున్‌‌‌‌‌‌‌‌ రెడ్డి 3–21, 10–21తో సో గ్యు చోయ్‌‌‌‌‌‌‌‌ (కొరియా)–వి షెమ్‌‌‌‌‌‌‌‌ గో (మలేసియా) చేతిలో ఓడారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ప్రియా–శ్రుతి మిశ్రా 15–21, 13–21తో రిరినా హిరామోటో–కొకొనా ఇషికావా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో పరాజయం చవిచూశారు.