V6 News

డబుల్ హారన్స్ పై స్పెషల్ డ్రైవ్...173 మందిపై కేసు.. రూ. 1.73 లక్షల ఫైన్

డబుల్ హారన్స్ పై స్పెషల్ డ్రైవ్...173 మందిపై కేసు.. రూ. 1.73 లక్షల ఫైన్

ఎల్బీనగర్, వెలుగు: కార్లకు సైరన్​లు, బైక్​లకు డబుల్ హారన్​లు పెట్టుకొని నగరంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వాహనదారులపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మల్కాజిగిరి, తిరుమలగిరి డివిజన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా116 సైరన్ కేసులు, 42 డబుల్ హారన్ కేసులు నమోదు చేసి, మొత్తం 173 మందికి రూ. 1.73 లక్షల జరిమానా విధించారు. 

ఫైన్ వేయడమే కాకుండా ఆ సైరన్​లను అక్కడికక్కడే తొలగించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలతో ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఈ స్పెషల్ డ్రైవ్ మున్ముందు కూడా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.