
రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు
నటీనటులు : అనుష్క,మాధవన్,అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల,మైకేల్ మాడ్సన్, సుబ్బరాజు తదితరులు
స్క్రీన్ ప్లే: కోన వెంకట్
మ్యూజిక్ : గోపి సుందర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గిరీష్.జి
సినిమాటోగ్రఫీ:షానీల్ డియో
ఎడిటింగ్: ప్రవీన్ పూడీ
ప్రొడ్యూసర్: టి.జి విశ్వప్రసాద్
స్టోరీ,డైరెక్షన్: హేమంత్ మధుకర్
రిలీజ్ డేట్:అక్టోబర్ 2,2020
కథేంటి:
సాక్షి (అనుష్క) , సోనాలి (షాలినీ పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి ఒకే దగ్గర పెరుగుతారు.అయితే సాక్షి జీవితంలోకి (ఆంటోనీ) రావడం సోనాలికి నచ్చదు. సాక్షి,ఆంటోని విడిగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఆంటోని దారుణ హత్యకు గురవుతాడు.ఈ హత్యకు కారకులు ఎవరు.? అతన్ని ఎవరు చంపారు అనే కోణంలో పోలీసాఫీసర్ మహా (అంజలి) నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.తనకు ఆశ్చర్యపోయే నిజాలు ఎదురవుతాయి.ఇంతకీ ఈ మర్డర్ వెనక మిస్టరీ ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్:
స్టార్ హీరోయిన్ అనుష్క తన పాత్రలో అద్భుతంగా నటించింది.మాటలు రావి,చూపులేని చాలెంజింగ్ పాత్రలో అనుష్క తన హావభావలతో నటించి మెప్పించింది.మాధవన్ తన పాత్రకు న్యాయం చేశాడు. మైఖేల్ మాడ్సన్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. షాలినీ పాండే ఫర్వాలేదనిపించింది.పోలీసాఫీసర్ పాత్రకు అంజలి సూటవ్వలేదు.సుబ్బరాజు,శ్రీవివాస్ అవసరాల తదితరులు తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు.
టెక్నికల్ వర్క్:
షానీల్ డియో సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.అన్ని లోకేషన్లను అందంగా చూపించాడు.గోపీ సుందర్ మ్యూజిక్ ఓకే. గిరీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.ఆర్ట్ వర్క్ నీట్ గా ఉంది..నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తీసారు.కొన్ని సంభాషణలు బాగున్నాయి.
విశ్లేషణ:
నిజానికి ‘‘నిశబ్డం’’ లైన్ ఇంట్రస్టింగ్ గా ఉంది.కథ బాగానే కుదిరింది కానీ దానికి ఇతర క్రాఫ్ట్ లనుండి సరైన సాయం అందలేదు.నిజానికి డైరెక్టర్ అందరి నుండి సరైన ఔట్ పుట్ తీసుకోవడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.హేమంత్ మధుకర్ అనుకున్న లైన్ బాగానే ఉన్నా.. దానికి సరైన కథనాన్ని రాసుకోలేదనిపిస్తుంది.రాసుకున్న దానిని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు..స్టార్టింగ్ ఇంట్రస్టింగ్ గానే మొదలైనప్పటికీ..బోరీంగ్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా పేస్ పడిపోయింది..సెకండాఫ్ లో కూడా పెద్దగా ఎంగేజింగ్ సీన్లు లేకపోయేసరికి మరీ నీరసమొస్తుంది.అనుష్క శాయశక్కులా ప్రయత్నించినా కానీ లాభం లేకపోయింది. ఓవరాల్ గా ‘‘నిశబ్దం’’ మెప్పించలేకపోయింది.
బాటమ్ లైన్: ‘‘నిశబ్దం’’ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది.