హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ లాంచ్ ..7 సీటర్, 30కి పైగా భద్రతా ఫీచర్లు

హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ లాంచ్ ..7 సీటర్, 30కి పైగా భద్రతా ఫీచర్లు

నిస్సాన్ మోటార్స్  తన కొత్త ఎంపీవీ గ్రావైట్​ను హైదరాబాద్‌‌లో శుక్రవారం వైబ్రంట్​ మొబిలిటీ గ్రూపు ద్వారా విడుదల చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 5.65 లక్షలు. ఈ ఏడు సీటర్ల ఎంపీవీలో 30కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌‌తో వస్తుంది.  72 పీఎస్ శక్తిని, 96 ఎన్ఎం టార్క్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది. 

లీటరుకు సుమారు 18 నుంచి 19 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.  625 లీటర్ల భారీ బూట్ స్పేస్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన హెడ్‌‌‌‌‌‌‌‌ల్యాంప్స్ వంటి ఇతర ఆకర్షణలూ ఉన్నాయి. 7-సీటర్ సామర్థ్యం(removable) మూడవ వరుస సీట్లు ఆధునిక డాష్‌బోర్డ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.  మారుతి ఎర్టిగా వంటి ఇతర MPVలకు ఇది బడ్జెట్ ప్రత్యామ్నాయంగా ఉంటుంది.