బార్ ఓపెన్ చేసేశ్రీమతి ఫేమ్

బార్ ఓపెన్ చేసేశ్రీమతి ఫేమ్

నిత్యామీనన్ లీడ్‌‌ రోల్‌‌లో నటించిన వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. అవసరాల శ్రీనివాస్ స్క్రీన్‌‌ ప్లే, డైలాగ్స్ అందిస్తూ షో క్రియేటర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. నాని ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌‌‌‌ను శుక్రవారం లాంచ్ చేశాడు. కథ విషయానికొస్తే.. కోర్టు కేసుల్లో ఉన్న తమ ఇల్లు చేతికొస్తేనే తప్ప పెళ్లి చేసుకోనని ఫిక్స్ అవుతుంది సిరి అలియాస్ శ్రీమతి. అందుకు ముప్ఫై లక్షలు కావాలనడంతో, ఆ డబ్బు కోసం ఊర్లో బార్‌‌‌‌ ఓపెన్ చేయాలి అనుకుంటుంది. 

కానీ తను అమ్మాయి కావడంతో ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లు వ్యతిరేకిస్తారు. ఆ ప్రయత్నంలో ఆమె సక్సెస్ అయిందా లేదా అనేది మిగతా కథ. నిత్యామీనన్ నటన ఆకట్టుకుంది. గౌతమి, తిరువీర్, నిరుపమ్, నరేష్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, మహేష్ ఇతర పాత్రలు పోషించారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్‌‌ సిరీస్‌‌ కుటుంబమంతా కలిసి చూసేందుకు పర్ఫెక్ట్ చాయిస్ అని చెబుతున్నారు మేకర్స్. సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్‌‌ ప్రైమ్‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.