
పొగ, సింథటిక్ దుస్తులు, సెడెంట్రీ లైఫ్‌స్టయిల్, యాంటీ–పెర్స్పిరెంట్స్.. లాంటివాటి వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దాంతో చాలా మందికి చర్మం నుంచి చెమట బయటికి పోదు. అలాంటివాళ్లు స్టీమ్ బాత్ చేస్తే.. స్వేద రంధ్రాలు మళ్లీ తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటికిపోతాయి. మరి ఇంట్లో స్టీమ్ బాత్ చేయడమెలా? అంటే ఈ గాడ్జెట్ ఉంటే సరిపోతుంది.
నివ్‌కార్ట్ అనే కంపెనీ దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లో స్టీమ్ జనరేటర్‌తో పాటు బాత్ క్యాబిన్, ఈ రెండింటినీ కనెక్ట్ చేసేందుకు ఒక పైప్ వస్తాయి. స్టీమ్ జనరేటర్ 1,000 వాట్స్ పవర్‌తో పనిచేస్తుంది. చాలా తక్కువ టైంలోనే క్యాబిన్‌ని ఆవిరితో నింపేస్తుంది. స్టీమ్ టెంపరేచర్‌ని 60 సెంటీగ్రేడ్ వరకు 9 స్థాయిల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని ట్యాంక్‌లో 2.6 లీటర్ల నీళ్లు నింపొచ్చు. స్టీమ్ టైంని 1 నుంచి -60 నిమిషాల వరకు సెట్ చేసుకోవచ్చు. ఇందులోని బాయిలర్‌ని హై క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేశారు. దీనికి ఉండే ఎల్‌సీడీ డిస్‌ప్లేలో టెంపరేచర్ చూపిస్తుంటుంది. దీన్ని రిమోట్‌తో కూడా ఆపరేట్ చేయొచ్చు.