రికార్డులకెక్కిన నిజామాబాద్ ​ఎన్నిక

రికార్డులకెక్కిన నిజామాబాద్ ​ఎన్నిక
  •  ఎన్నికల సంఘానికి కంట్రీ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లేఖ

లోక్​సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీచేసిన నిజామాబాద్​ నియోజకవర్గం కంట్రీ బుక్​ఆఫ్​వరల్డ్​ రికార్డ్​లకు ఎక్కింది. ఈమేరకు కంట్రీ బుక్ నిర్వాహాకుల నుంచి అధికారిక లెటర్​ అందినట్లు ఈసీ, ఎంపీ ధర్మపురి అర్వింద్​చెప్పారు. త్వరలో ఈ లేఖను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న  జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ సీటుకు 185 మంది పోటీ చేశారు.
దీంతో 1788 పోలింగ్ స్టేషన్లలో,  26,820 బ్యాలెట్ యూనిట్లను, 2 వేల కంట్రోల్ యూనిట్లు, 2 వేల వీవీ ప్యాట్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో 2 వేల మంది సిబ్బంది, 600 మంది ఇంజనీర్లు పాల్గొన్నారని, ఫలితాల కౌంటింగ్​కు 15 హాళ్లలో 149 టేబుల్స్ ఏర్పాటుచేసినట్లు తెలిపింది.