
నిజామాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడు
మొత్తం ఓటర్లు 824 మంది.. 50 సెంటర్ల ఏర్పాటు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 50 పోలింగ్సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాలకు చెందిన 824 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్లు, నిజామాబాద్‌సిటీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. గురువారం సాయంత్రమే సిబ్బంది పోలింగ్ సామగ్రితో వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకున్నారు. కరోనా ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఆఫీసర్లు సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి శానిటైజర్, ఫేస్‌షీల్డ్‌లు అందజేశారు. ఎలక్షన్ అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించి, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు సూచనలు చేశారు. ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్ కన్ఫర్మ్అయినట్టు సమాచారం. వీరు ఓటు వేసేందుకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ముందుగా అప్లయ్ చేసుకున్నవారు పోస్టల్ బాలెట్ వాడుకోవచ్చు. లేదంటే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పీపీఈ కిట్లు వేసుకుని వచ్చి పోలింగ్సెంటర్లో ఓటు వేయవచ్చు. పేషెంట్లకు సొంత వెహికిల్ లేకపోతే అంబులెన్స్ ఫెసిలిటీ కల్పిస్తామని ఆఫీసర్లు చెప్పారు. నిజామాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డి డిస్క్వాలిఫై కావడంతో ఈ బై ఎలక్షన్ జరుగుతోంది. ఫిబ్రవరి 2022 వరకు పదవీకాలం ఉన్న ఈ పోస్టు కోసం టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్కు 4 పీపీఈ కిట్లు
ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్‍తోనే జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ స్టేషన్‍లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్ పేపర్‍పై ఓటు వేయాలని, వెంట తెచ్చుకున్న ఇతర పెన్నుతో ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ కరోనా పేషెంట్లకు కూడా ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో ప్రతి పోలింగ్ స్టేషన్కు 4 పీపీఈ కిట్లు, ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 10 శానిటైజర్ బాటిళ్లు ఇచ్చారు. పోలింగ్ సిబ్బంది మాస్క్, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ తప్పనిసరి వాడాలని కలెక్టర్ చెప్పారు.
For More News..