పోలీస్ స్టేషన్  పై నుంచి దూకి.. యువతి ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్  పై నుంచి దూకి.. యువతి ఆత్మహత్యాయత్నం

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్  జిల్లా బాల్కొండలో కొనసాగుతున్న ముప్కాల్​ పోలీస్ స్టేషన్  బిల్డింగ్​ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సై శైలేందర్  తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ తహసీల్దార్​ ఆఫీస్ లో పని చేసే ఓ ఉద్యోగి బాల్కొండలోని ఓ ఇంటిలో పదేండ్లుగా అద్దెకు ఉంటున్నాడు. అయితే సదరు ఉద్యోగి రెంట్​కు ఉన్న వ్యక్తి కొడుకు తన కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది.

శనివారం ఈ కేసు వ్యవహారంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతి మోసపోయాననే ఆవేదనతో స్టేషన్  బిల్డింగ్​ పై నుంచి దూకింది. ఆమెకు గాయాలవగా, చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని ఎస్సై చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.