మెడికల్ కాలేజీలు ప్రాక్టికల్స్కు సహకరించాలి: ఎన్ఎంసీ

మెడికల్ కాలేజీలు ప్రాక్టికల్స్కు సహకరించాలి: ఎన్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా పీజీ మెడికల్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సంస్థలు ఇకపై మొండికేయడానికి వీల్లేదని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈఎంఎస్) నిర్వహించే ప్రాక్టికల్ ఎగ్జామ్స్​కు సెంటర్లు కేటాయించడం లేదని, ఫ్యాకల్టీని ఎగ్జామినర్ డ్యూటీలకు పంపడం లేదని వస్తున్న ఫిర్యాదులపై ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ సీరియస్ అయింది.

ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్​లకు జారీ చేసిన అడ్వైజరీలో.. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్‌‌‌‌‌‌‌‌ ఫ్రాస్ట్రక్చర్, వార్డులు, ల్యాబ్​లు, క్లినికల్ మెటీరియల్​తో పాటు పేషెంట్లను కూడా అందుబాటులో ఉంచాలని, ఎంపికైన ఫ్యాకల్టీని సకాలంలో రిలీవ్ చేయాలని ఆదేశించింది. పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రమాణాలను కాపాడేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తిస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లంగర్ సూచించారు.