ఎఫ్ఎంజీఈ నిబంధనల సవరణకు ఎన్ఎంసీ ముసాయిదా 

ఎఫ్ఎంజీఈ నిబంధనల సవరణకు ఎన్ఎంసీ ముసాయిదా 
  • 2021 ఎఫ్ఎంజీఎల్ రూల్స్ లో క్లాజ్ 4(బి) మార్పునకు ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ నిబంధనల్లో సవరణలు చేసేందుకు  నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) నిబంధనలు, 2026 పేరుతో నవంబర్ 17న భారత అసాధారణ గెజిట్ (పార్ట్ III - సెక్షన్ 4, నం.682)లో దీనిని ప్రచురించింది.

2021 నవంబర్ 18న విడుదల చేసిన ప్రధాన నిబంధనల్లోని (నం.581) క్లాజ్ 4, సబ్ -క్లాజ్ (బి)లో ఉన్న ‘‘మెడికల్ డిగ్రీ ప్రదానం చేసిన దేశంలోని సంబంధిత అధికార పరిధిలో వైద్య వృత్తి చేపట్టేందుకు లైసెన్స్ జారీ చేయగల ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ లేదా ఇతర సంస్థ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. అది ఆ దేశ పౌరులకు ఇచ్చే మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్‌ తో సమానంగా ఉండాలనే వాక్యాన్ని తొలగించి, దాని స్థానంలో ఆ దేశంలోని సంబంధిత ప్రొఫెషన ల్ రెగ్యులేటరీ బాడీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి’’ అని సవరించాలని ప్రతిపాదించింది.

తుది నిబంధనలు అధికారిక గెజిట్‌ లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రజలు గెజిట్ ప్రతులు అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా అభ్యంతరాలు పంపాలని ఎన్ఎంసీ కార్యదర్శి రాఘవ్ లంగర్ తెలిపారు. అభ్యంతరాలుంటే [email protected]కి పంపాలని స్పష్టం చేశారు.