2 మెడికల్ కాలేజీలకు ఎన్‌‌‌‌ఎంసీ గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌

2 మెడికల్ కాలేజీలకు ఎన్‌‌‌‌ఎంసీ గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌

రాష్ట్రంలో మరో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. వీటిని ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది.  కొమురంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటుచేసిన కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నామని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌కు శనివారం లేఖ రాసింది. ఒక్కో కాలేజీకి 100 సీట్లు చొప్పున కేటాయించాలని మెడికల్ ఎడ్యుకేషన్‌‌ విభాగం చేసిన విజ్ఞప్తికి  ఎన్ఎంసీ అంగీకరించింది. దీనిపై హర్షం వ్యక్తంచేస్తూ  రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు ఓ ట్వీట్ చేశారు. జనగామ, వికారాబాద్‌‌ కాలేజీలకు లెటర్‌‌‌‌ ఆఫ్ ఇంటెంట్​ను  ఎన్ఎంసీ జారీ చేసింది. ఈ కాలేజీలు, దవాఖానాలలో ఉన్న లోపాలను సవరిస్తామని, అవసరమైన చర్యలు చేపడుతామని రాష్ట్ర సర్కార్ అండర్ టేకింగ్ ఇస్తే ఈ రెండు కాలేజీలకు కూడా పర్మిషన్ మంజూరు అవుతుంది.