హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీకి రాష్ట్ర సర్కార్ దరఖాస్తు చేయగా ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది కరీంనగర్‌తో పాటు, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేసిన కాలేజీలకు కూడా పర్మిషన్ వచ్చింది. దీంతో 900 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
