సనాతన ధర్మంలో శనివారాన్ని శనిదేవుడికి ప్రత్యేకమైన రోజుగా చెప్తారు. ఈ రోజు ఆయనను పూజించడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు మనం చేసే పనులకు తగ్గట్టుగా ఫలితాలను ఇచ్చే న్యాయదేవుడు. మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాలను ఇస్తూ వారి జీవితాలను మారుస్తాడు, అదే తప్పులు చేసేవారిని శిక్షిస్తాడు. మరి శనిదేవుడి అనుగ్రహం మనపై ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...
1. ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదుగుదల
మీరు చాలా కాలంగా పడుతున్న కష్టానికి అకస్మాత్తుగా మంచి గుర్తింపు, విజయం లభిస్తే.. శనిదేవుడు మీపై ప్రసన్నుడయ్యాడని అర్థం. మీరు చేసిన మంచి పనుల ఫలితాన్ని ఆయన మీకు ఇస్తున్నారనడానికి ఇది సంకేతం. దీనివల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు కలగడం జరుగుతుంది.
2. అప్పులు, కోర్టు సమస్యల నుంచి
మీరు చాలా కాలంగా ఏదైనా కోర్టు కేసుతో ఇబ్బంది పడుతూ, అకస్మాత్తుగా తీర్పు మీకు అనుకూలంగా వస్తే.. అది ఖచ్చితంగా శనిదేవుడి ఆశీస్సే. అలాగే పాత అప్పుల బాధల నుంచి విముక్తి లభించినా ఆయన అనుగ్రహం మీపై ఉన్నట్టే లెక్క.
3. శనికి సంబంధించిన వస్తువులతో లాభాలు
ఇనుము, నూనె, బొగ్గు వంటి వాటిని శనిదేవుడికి సంబంధించిన వస్తువులుగా చెప్తారు. మీరు ఏదైనా కొత్త వాహనం అంటే బండి లేదా కారు కొనుక్కున్నా లేదా ఈ రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చినా శనిదేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు.
4. ప్రవర్తనలో మంచి మార్పులు
శనిదేవుడికి క్రమశిక్షణ, నిజాయితీ అంటే చాలా ఇష్టం. మీలో అకస్మాత్తుగా ఓపిక పెరిగి, పద్ధతిగా ఉంటూ, అబద్ధాలకు ఇంకా తప్పుడు పనులకు దూరంగా ఉంటున్నారంటే.. శనిదేవుడే స్వయంగా మీకు మంచి మార్గం చూపిస్తున్నాడని అర్థం. చివరగా ఒక మాట శనిదేవుడు ఎప్పుడూ కష్టపడేవారిని, నిజాయితీగా ఉండేవారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
