హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న నీటి ఎద్దడిని నివారించడానికి వాటర్ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాగునీటిని వృథా చేసే వారికి జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాగునీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, రోడ్ల పరిశుభ్రతకు ఉపయోగించడాన్ని నిషేధించారు. నీటిని వృథా చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇంకా అలాగే చేస్తే వారిపై క్రిమినల్కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
రైల్వే, రిఫైనరీల వంటి భారీ పరిశ్రమలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు త్వరగా ప్రవేశించి, జలాశయాలు నిండితే తప్ప ఈ గడ్డు పరిస్థితుల నుంచి ఉపశమనం లభించడం కష్టమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ముందుచూపు లేకపోతే కష్టమే..
జంట నగరాల్లో ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. రాబోయే రోజుల్లో ఏర్పడే పరిస్థితిని ఎదుర్కొనేందు కు ముందు చూపుతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలు పెంచుకోవడానికి కృషి చేయాలి. ప్రతి ఇంట్లో వర్షపు నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ముందు చూపులేక పోతే మాత్రం భవిష్యత్‌లో నీటి కరువు తీవ్రంగా ఉంటుంది.
- కె.అశోక్‌రెడ్డి, ఎండీ, వాటర్ బోర్డు
