కియా కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఇప్పుడే డిసైడ్ అవ్వండి.. పెరగనున్న ధరలు!

కియా కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఇప్పుడే డిసైడ్ అవ్వండి.. పెరగనున్న ధరలు!

కియా కార్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో అర్జెంట్ అప్‌డేట్. కియా ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల అంటే జూలై 1, 2026 నుండి కియా తన అన్ని కార్ల మోడల్స్, వేరియంట్ల ధరలు 2 శాతం వరకు పెంచుతోంది. పెరిగిన తయారీ ఖర్చులు, పెరిగిన రా మెటీరియల్ ధరలు, ఆపరేషన్ ఖర్చుల వల్లే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ స్పష్టం చేసింది.

వాస్తవానికి గత కొంత కాలంగా ఆటోమొబైల్ రంగానికి తయారీ ఖర్చులు భారంగా మారాయి. అయినా కస్టమర్లపై పూర్తి భారం పడకుండా ఉండటానికి తామే చాలా వరకు ఆ నష్టాన్ని భరించామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరల సర్దుబాటు తప్పడం లేదని కియా ఇండియా చెబుతోంది. అయితే ఈ ధరల పెంపు అనేది అన్ని కార్లపై ఒకేలా ఉండదు. కస్టమర్లు ఎంచుకునే మోడల్ వేరియంట్‌ను బట్టి ఈ 2% పరిధిలో మార్పులు ఉంటాయి.

ఇది కేవలం కియా కంపెనీ ముచ్చట మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. ఇటీవలే ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా తమ కమర్షియల్ వాహనాల ధరలను జూలై 1, 2026 నుండి 2.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముడిసరుకుల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా టాటా గ్రూప్ చెప్పింది. సో ఒకవేళ మీరు కియా సెల్టోస్, సోనెట్ లేదా ఇన్నోవేటివ్ ఈవీ కార్లను ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే.. జూలై 1 లోపు బుక్ చేసుకోవడమే బెస్ట్ ఐడియా.