హైదరాబాద్‌‌లో ఎన్​ఎండీసీ ఆర్‌‌ అండ్‌‌ డీ సెంటర్

హైదరాబాద్‌‌లో ఎన్​ఎండీసీ ఆర్‌‌ అండ్‌‌ డీ సెంటర్

హైదరాబాద్, వెలుగు: మినరల్ ప్రాసెసింగ్‌‌లో నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా ఎన్​ఎండీసీ లిమిటెడ్ మంగళవారం పటాన్‌‌చెరులో తన నూతన అత్యాధునిక పరిశోధన  అభివృద్ధి కేంద్రాన్ని ఆవిష్కరించింది.  గత ఐదేళ్లలో పరిశోధన,  అభివృద్ధి కోసం రూ. 150 కోట్లకు పైగా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టామని, కొత్త ఆర్ అండ్ డి కేంద్రాన్ని నిర్మించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ తెలిపింది.  

పటాన్‌‌చెరులో ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ లీడింగ్ ఎడ్జ్ సదుపాయాన్ని ఇతర డైరెక్టర్లు  సీనియర్ అధికారుల సమక్షంలో ఎన్​ఎండీసీ  సీఎండీ (అదనపు బాధ్యత) అమితావ ముఖర్జీ ప్రారంభించారు. ఈ ఆర్​అండ్​డీ సెంటర్‌‌లో అత్యాధునిక ప్రయోగశాలలు ఉన్నాయి. ఇవి సస్టెనబుల్​ మినరల్​టెక్నాలజీపై ఫోకస్​ చేస్తాయి.