పోలింగ్ రోజున సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నో హాలిడే

పోలింగ్ రోజున సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నో హాలిడే
  • ప్రభుత్వం ఆదేశించినా పట్టిం చుకోని వైనం
    సుమారు 25 లక్షల మంది ఓటర్లపై ప్రభావం
    చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరికలు

టెకీలకు నో హాలిడే

లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజు సెలవు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఓటు వేసేందుకు రవాణాసౌకర్యం కల్పిస్తామని, పూర్తిగా సెలవు ఇవ్వలేమని తేల్చిచెబు తున్నాయి. కొన్ని కంపెనీలు కొందరికి సెలవు ఇచ్చి, పలు విభాగాల ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాల్సిందేనని చెబుతున్నాయి.‘‘గురువారం పోలింగ్. తర్వాత రోజు ఒకే వర్కిం గ్డే. శని, ఆదివారాలు సెలవు. పోలింగ్ కు సెలవు ఇస్తేఓటు వేసేందుకు వెళ్లిన ఉద్యోగులు శుక్రవారం కూడా లీవ్ తీసుకుంటారు. వరుసగా నాలుగు రోజుల సెలవువల్ల సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది”అని కంపెనీలు చెబు తున్నట్లు సమాచారం. 11న సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలుజారీ చేసింది . వీటిని రాష్ట్రవ్యా ప్తంగా అన్ని కంపెనీలు తప్పకుండా పాటించాలని కార్మిక శాఖ స్పష్టంచేసింది.

25 లక్షల మంది

హైదరాబాద్ లో తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 5 లక్షల మందివరకు సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్నారు. వీళ్ల కుటుంబసభ్యులు, సాఫ్ట్ వేర్ కంపెనీలపై ఆధారపడేక్యాబ్ లు, బస్సులు, ట్రావెల్స్, కంపెనీల్లో పనిచేస్తున్నసిబ్బంది ఇలా సుమారు 25 లక్షల మంది ఉన్నట్లుఅంచనా. దీంతో సెలవు ఇవ్వని కారణంగా వీళ్లలోచాలా మంది ఓటింగ్ కు దూరమయ్యే సూచనలు కనపడుతున్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పోలిం గ్70 శాతం పైనే నమోదవుతున్నా, గ్రేటర్ పరిధిలోనిఅసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రం 55శాతం దాటడం లేదు.అసెంబ్లీ ఎన్ని కలప్పుడూ ఇవ్వలేదు గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడాచాలా కంపెనీలు సెలవు ఇవ్వలేదు. పోలింగ్ కుముందు ఐటీ కంపెనీలతో సీఈవో రజత్ కుమార్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సెలవు ఇస్తామని, తర్వాత ఇవ్వలేదని ఉద్యోగులు చెబు తున్నారు.మరోవైపు సాఫ్ట్ వేర్ కంపెనీలు 24 గంటలుపనిచేయాల్సి ఉంటుందని, లేకపోతే వ్యాపార భాగస్వాము లకు సరైన సమయంలో తమ ప్రొడక్ట్ నుడెలివరీ చేయలేమని పలు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 25శాతం మంది మూడు షిప్టుల్లో 24 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుం దని పేర్కొంటు న్నారు.

సెలవు ఇవ్వా లనికంపెనీలను కోరాం

ఓటింగ్ రోజు సెలవు ఇవ్వాలని కోరాం . కొన్ని కంపెనీలు పోలిం గ్ రోజు సెలవు ఇచ్చిశనివారం వర్కిం గ్ డేగా ఖరారు చేశాయి.సెలవు ఇవ్వని కంపెనీల సమాచారం ఈసీకిఅందజేశాం . ఉద్యోగులు తక్కువగాఉన్నారంటూ పలు కంపెనీలు సెలవుఇవ్వటా నికి నిరాకరిస్తున్నాయి. సందీప్ మక్తాల, తెలంగాణ ఐటీఅసోసియేషన్ అధ్యక్షుడు