న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం అత్యవసర మందుల ధరలను పెంచబోమని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా గురువారం ప్రకటించారు. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏటా టోకు ధరల సూచీ ఆధారంగా షెడ్యూల్ చేసిన మందుల ధరలను సవరిస్తుంటుందని మంత్రి చెప్పారు.
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ధరల పెరుగుదల ఉంటుందని, తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయని మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం పెరగలేదు కాబట్టి ధరలను పెంచబోవడం లేదని మాండవియా స్పష్టం చేశారు.