ఓటరు కార్డుకు, పథకాలకు సంబంధం లేదు: సిద్దిపేట జిల్లా కలెక్టర్

ఓటరు కార్డుకు, పథకాలకు సంబంధం లేదు: సిద్దిపేట జిల్లా కలెక్టర్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఓటరు గుర్తింపు కార్డును ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికీ అనుసంధానం చేయరని, ఎన్యూమరేషన్ ఫారం సమర్పిస్తే పథకాలు నిలిచిపోతాయనే వదంతులు పూర్తిగా అవాస్తమని సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు.

బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అర్హులైన ఓటర్లందరూ ఎలాంటి అపోహలు నమ్మకుండా బీఎల్‌‌‌‌వోలకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలని కోరారు. 

అనంతరం కలెక్టరేట్‌‌‌‌లో పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు అత్యధిక ఆదాయం అందించే పట్టుపురుగుల పెంపకం, మల్బరీ సాగుపై దృష్టి సారించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.