మెదక్: పెద్దశంకరంపేట మండలం మక్తా లక్ష్మాపూర్లో విషాదం జరిగింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శోకసంద్రంలో ముంచెత్తింది. బతుకు దెరువు కోసం కొన్నేళ్ల క్రితం మక్తా లక్ష్మాపూర్కు చెందిన బేతమ్మ భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లింది. భార్యాభర్తల మధ్య గొడవ శుక్రవారం గొడవ జరిగింది.
దీంతో.. క్షణికావేశంలో హైదరాబాద్లో బేతమ్మ(45) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తల్లి మరణవార్త విని కొలపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని 19 ఏళ్ల ప్రవీణ్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
