డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌కు BMW కార్లు: హీరోయిన్కు కనీసం స్కూటీ కూడా ఇవ్వలేరా? నిర్మాతపై ఫ్యాన్స్ ఫైర్!

డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌కు BMW కార్లు: హీరోయిన్కు కనీసం స్కూటీ కూడా ఇవ్వలేరా? నిర్మాతపై ఫ్యాన్స్ ఫైర్!

సినిమా సక్సెస్ అయితే చిత్రబృందానికి నిర్మాతలు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం ఈ మధ్య సాధారణంగా మారిపోయింది. తాజాగా తమిళ సినిమా DC విషయంలోనూ ఇదే జరిగింది. సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్.. చిత్రానికి కీలకంగా పనిచేసిన ముగ్గురికి ఏకంగా కొత్త BMW కార్లను బహుమతిగా అందించారు. అయితే హీరోయిన్ వామికా గబ్బి, మరో నటి సంజనా కృష్ణమూర్తికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.100 కోట్లకు పైగా వసూళ్లు..

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన DC సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి కీలక పాత్రల్లో కనిపించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.

సక్సెస్‌కు గుర్తుగా BMW కార్లు..

సినిమా విజయంతో సంతోషించిన నిర్మాత కళానిధి మారన్.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరో లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు కొత్త BMW కార్లను గిఫ్ట్‌గా అందించారు. ఈ సందర్భంగా ముగ్గురితో కలిసి కళానిధి మారన్ ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాకు దర్శకత్వం వహించిన అరుణ్, హీరోగా నటించిన లోకేష్, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుధ్.. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారని భావించిన నిర్మాత వారికి ఈ ప్రత్యేక కానుకలు అందించినట్లు తెలుస్తోంది.

వామికాకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నలు..

అయితే ఈ BMW గిఫ్ట్స్ ఇప్పుడు మరో చర్చకు దారితీశాయి. సినిమాలో హీరోయిన్‌గా నటించిన వామికా గబ్బికి ఎందుకు గిఫ్ట్ ఇవ్వలేదంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర పాత్రలో వామికా గబ్బి నటనకు మంచి స్పందన రావడంతో.. ఆమెను కూడా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగం చేయాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఓ నెటిజన్ స్పందిస్తూ.. వామికాకు కనీసం స్కూటీ అయినా ఇవ్వాల్సిందని కామెంట్ చేయగా, మరో అభిమాని సంజనా కృష్ణమూర్తికి కనీసం సైకిల్ అయినా ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. బహుమతుల విషయంలో హీరోయిన్లను కూడా గుర్తించి గౌరవించాల్సిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

‘వామికాకు ప్రైవేట్ జెట్ ఇవ్వండి’..

ఓ నెటిజన్ “వామికాకు ప్రైవేట్ జెట్ ఇవ్వండి” అంటూ కామెంట్ చేయగా.. మరో అభిమాని, ట్రైలర్ చూసినప్పుడే హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకంగా అనిపించిందని, అలాంటప్పుడు మహిళా నటికి ఎందుకు ప్రశంసలు, గుర్తింపు ఇవ్వలేదని ప్రశ్నించాడు. “ఎందుకు ఎప్పుడూ పురుషులకే ఈ కార్లు?” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ “వామికా కూడా ఒక BMWకి అర్హురాలే” అంటూ కామెంట్ చేశాడు. ఇంకొకరు అయితే “ఇది వామికా సినిమా.. ఆమెకు ముందుగా కారు ఇవ్వాలి” అంటూ ఘాటుగా స్పందించారు.

‘లోకేష్ కంటే తక్కువేం కాదు..’

మరో అభిమాని నిర్మాత కళానిధి మారన్‌ను ఉద్దేశించి.. మహిళా నటులను గుర్తించే విషయంలో మార్పుకు నాంది పలకాలని కోరాడు. వామికా గబ్బి లోకేష్ కనగరాజ్‌తో సమానంగా, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా నటించిందని, చంద్ర పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిందని పేర్కొన్నాడు. అందువల్ల ఆమెకు కూడా ప్రత్యేకంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సిందని, తమిళ చిత్ర పరిశ్రమలో మహిళా నటుల కృషిని గుర్తించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇక మరికొందరు అభిమానులు “థియేటర్లలో సగం చప్పట్లు వామికా కోసమే వచ్చాయి. ఆమెను పక్కన పెట్టడం సరికాదు. ఇది ముగ్గురి విజయం మాత్రమే కాదు.. మొత్తం చిత్రబృందం కలిసిన విజయం”, “వామికాకు కారు ఎందుకు ఇవ్వలేదు?” అంటూ ప్రశ్నించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

లోకేష్ యాక్టింగ్ డెబ్యూ..

ఇక DC సినిమాతో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటివరకు దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న ఆయన.. ఈ సినిమాలో దేవదాస్ ప్రేరణతో రూపొందిన కథలో దేవదాస్ పాత్రలో నటించారు. ఆయన లుక్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సినిమా విడుదలకు ముందే భారీగా ఆసక్తిని పెంచాయి. అరుణ్ మాథేశ్వరన్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు లోకేష్ నటన, వామికా గబ్బి పెర్ఫార్మెన్స్, అనిరుధ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. డార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన DC.. దేవదాస్ కథకు సరికొత్త టచ్ ఇచ్చింది.

థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ప్రస్తుతం Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా సినిమా సక్సెస్‌కు గుర్తుగా అరుణ్ మాథేశ్వరన్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ BMW కార్లు అందుకోవడం హాట్ టాపిక్‌గా మారగా.. హీరోయిన్ వామికా గబ్బి, నటి సంజనా కృష్ణమూర్తికి గిఫ్ట్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SUN NXT (@sunnxt)