ఏడేళ్ల తర్వాత.. భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఇవాళ(సెప్టెంబర్ 12) ప్రధానితో భేటీ

ఏడేళ్ల తర్వాత.. భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఇవాళ(సెప్టెంబర్ 12) ప్రధానితో భేటీ

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్ కు వచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం (సెప్టెంబర్ 12)న ప్రత్యేక విమానంలో న్యూఢిల్లి ఎయిర్  పోర్టులో దిగారు. కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఆయనకు స్వాగతం పలికారు. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2019 లో మామల్లాపురంలో జరిగిన అన్-అఫీషియల్ సదస్సు తర్వాత జిన్ పింగ్ ఇవాళ భారత్‌కు వచ్చారు. 

శనివారం సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.  భారత్-చైనా సరిహద్దుల్లో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదాలు, గాల్వన్ న్ ఘర్షణల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడం, ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులు, వీసాల పునరుద్ధరణ ,వాణిజ్య సంబంధాల మెరుగుదలపై ఈ భేటీలో చర్చించనున్నారు.