వినాయక చవితి పండగ వచ్చేసింది ! గణేష్ చతుర్థి అనగానే రకరకాల సైజుల్లో, రంగుల్లో, వివిధ రూపాల్లో విగ్రహలు, పూజా విధానాలు, నైవేద్యాలపైనే అందరి దృష్టి ఉంటుంది. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక పూజలో మనం విగ్రహ రంగులకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. గ్రహాల స్థితిగతులను బట్టి ఆయా రాశుల వారు ప్రత్యేక రంగుల్లో ఉన్న గణనాథుడిని ప్రతిష్టిస్తే అష్టైశ్వర్యాలు, శాంతి చేకూరుతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 14న(సోమవారం) వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈ రోజున చంద్రుడు తులారాశిలో సంచరించనున్నాడు. మరి ఈ పండగకు మీ రాశి ప్రకారం ఏ రంగు వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలో చూద్దాం...
1. మేష రాశి
మేష రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎరుపు రంగు గణపతిని పూజించాలి. ఇది ధైర్యం, సంకల్ప బలాన్ని పెంచి అడ్డంకులను తొలగిస్తుంది.
2. వృషభ రాశి
వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు క్రీమ్ లేదా లేత గులాబీ (pink) రంగు విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం వల్ల సౌకర్యం, శాంతి, సామరస్యం లభిస్తాయి.
3. మిథున రాశి
బుధ గ్రహ ప్రభావం వల్ల ఆకుపచ్చ రంగు విగ్రహం మిథున రాశి వారికీ శుభప్రదం. ఇది తెలివితేటలు, వ్యాపారం, విద్యలో పురోగతిని ఇస్తుంది.
4. కర్కాటక రాశి
కర్కాటక రాశికీ అధిపతి చంద్రుడు కాబట్టి తెలుపు రంగు గణనాథుడిని ఎంచుకోవాలి. దీనివల్ల మనశ్శాంతి, కుటుంబంలో స్వచ్ఛమైన వాతావరణం నెలకొంటుంది.
5. సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. నారింజ (ఆరెంజ్), కుంకుమ లేదా లేత బంగారు రంగు విగ్రహాలు ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతాయి.
6. కన్యా రాశి
బుధుడి ప్రభావంతో ఆకుపచ్చ రంగు గణపతిని పూజించడం వల్ల కన్యా రాశి వారికీ సకల శుభాలు కలుగుతాయి.
7. తులా రాశి
ఈ పండుగ రోజున చంద్రుడు తులారాశిలో ఉంటాడు. శుక్రుడి అనుగ్రహం కోసం గులాబీ లేదా లేత నీలం రంగు విగ్రహాలను తులా రాశి వారు తెచ్చుకోవడం చాలా విశేషం.
8. వృశ్చిక రాశి
కుజుడి అనుగ్రహం కోసం ముదురు ఎరుపు లేదా మెరూన్ రంగు విగ్రహాన్ని వృశ్చిక రాశి వారు ప్రతిష్టించాలి. ఇది శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది.
9. ధనుస్సు రాశి
గురు గ్రహంతో సంబంధం ఉన్నందున పసుపు రంగు గణపతి ధనుస్సు రాశి వారికీ అత్యుత్తమం. ఇది విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తుంది.
10. మకర రాశి
శని ప్రభావం ఉన్నందున బూడిద (గ్రే), రాతి రంగు లేదా మట్టి గోధుమ రంగు విగ్రహాలను మకర రాశి వారు ఎంచుకోవాలి. ఇవి స్థిరత్వాన్ని, క్రమశిక్షణను ఇస్తాయి.
11. కుంభ రాశి
కుంభ రాశి వారు నీలి రంగు గణపతిని ఇళ్లలో ప్రతిష్టించుకోవడం వల్ల శుభఫలితాలు పొందుతారు.
12. మీన రాశి
గురు బలం కోసం పసుపు రంగు గణేశుడిని పూజించడం మీన రాశి వారికీ అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ రాశికి తగిన రంగు గణపయ్యను పూజించి, ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరుడి పూర్ణ అనుగ్రహం పొందండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
