బరువు తగ్గాలంటే మనకు ఇష్టమైన ఫుడ్ మానేయడమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. స్వీట్స్ మొదలుకొని నాన్ వెజ్ వరకు ఇష్టమైన ఫుడ్ ఏదీ తినకుండా నోరు కట్టేసుకుంటారు చాలామంది. ఇక స్ట్రీట్ ఫుడ్ అనే మాట వింటేనే పాపమన్నట్లు బిహేవ్ చేస్తారు వెయిట్ లాస్ డైట్ లో ఉన్నవాళ్లు.అయితే.. బరువు తగ్గాలనుకునేవారు స్ట్రీట్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని..వాటి కేలరీలు, వండే పద్దతి, వంటి విషయాలను క్యాటగిరీలు విభజించి ఫ్యాట్ లాస్ కి ఏది మంచిదో సూచిస్తున్నారు.
ఇడ్లీ సాంబార్:
ఫ్యాట్ లాస్ కి హెల్ప్ చేసే స్ట్రీట్ ఫుడ్ లో ఇడ్లీ సాంబార్ అగ్రస్థానంలో ఉంది. ఇడ్లీని తక్కువ కేలరీలు ఉండే వంటకమని.. ఒక ఇడ్లీలో దాదాపు 100 నుండి 120 కేలరీలు ఉంటాయని.. ఇది ఫ్యాట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. తక్కువ క్యాలరీలు తీసుకుంటూ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ తినాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని అంటున్నారు.
మోమోస్:
మోమోస్ లో కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయని.. ఆవిరి మీద ఉడికించడం, వేయించడం వల్ల మోమోస్ లో అదనపు క్యాలరీస్ ఉండే అవకాశం లేదని అంటున్నారు.
అయితే..మోమోస్ లో నింపేందుకు ఫ్రెష్ చికెన్ లేదా పనీర్ వాడాలని.. ఐదారు మోమోస్ మాత్రమే పరిమితంగా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని అంటున్నారు.
పానీ పూరి:
స్ట్రీట్ ఫుడ్ కి కింగ్ లాంటి పానీ పూరి కూడా ఫ్యాట్ లాస్ కి మంచిదని అంటున్నారు నిపుణులు. పానీ పూరీలో కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయని... తక్కువ తిన్నా కూడా కడుపు నిండా ఉంచడంలో సాయపడుతుందని అంటున్నారు. బరువు తగ్గాలని అనుకునేవారు ఆలోచించకుండా పానీ పూరి తినొచ్చని అంటున్నారు నిపుణులు.
సమోసా, ఆలూ టిక్కీ:
ఒక సమోసాలో 300 క్యాలరీలు ఉంటాయని.. ఇది ఆలూ కచోరి కంటే మంచి సెలక్షన్ అని అంటున్నారు నిపుణులు. సమోసాలొ ఉండే బంగాళాదుంప కూర వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుందని.. ఇది ఫ్యాట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. ఆలూ టిక్కీ కూడా ఫ్యాట్ లాస్ కి హెల్ప్ అవుతుందని సూచిస్తున్నారు.
