300 మంది యువకులపై నో మాస్కు కేసులు

300 మంది యువకులపై నో మాస్కు కేసులు

మంచిర్యాలలో జనానికి కరోనాపై అవగాహన కల్పించారు పోలీసులు. మాస్కులు లేకుండా బయటతిరుగుతున్న వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫైన్ విధించారు.  రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకు అధికమవుతోంది. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి అద్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారిని గుర్తించి పోలిస్ స్టేషన్ కు తరలించి జరిమానా విధించారు. ఈ సందర్బంగా dcp మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని, కరోనా వైరస్ పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు. అనంతరం మాస్కులు లేకుండా తిరుగుతున్నా వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహింఛి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకారం సుమారు 300 మంది యువకులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున జరిమానా విదించారు.