
లాహోర్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌కు సెలెక్టర్లు షాకిచ్చారు. ఆసియా కప్ కోసం ఆదివారం ప్రకటించిన జట్టులో ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. సల్మాన్ ఆఘా నేతృత్వంలో 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. 2021 యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారి ఇండియాపై పాక్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బాబర్, రిజ్వాన్ కొంత కాలంగా షార్ట్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో చివరిసారి ఈ ఫార్మాట్‌లో ఆడారు. బాబర్ తన ఆటలోని కొన్ని అంశాలను మెరుగుపర్చుకోవాలని సూచించినట్లు హెడ్ కోచ్ మైక్ హెసన్ వెల్లడించాడు.
‘మూడు ఫార్మాట్లలో ఫామ్‌ను కొనసాగించడం చాలా కష్టం. తొలి వన్డేలో బాగా ఆడిన బాబర్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇబ్బందిపడ్డాడు. అందుకే స్పిన్, స్ట్రయిక్ రేట్‌ను మెరుగుపర్చుకోవాలని చెప్పాం. దానికోసం అతను శ్రమిస్తున్నాడు’ అని హెసన్ పేర్కొన్నాడు. జులైలో బంగ్లాదేశ్, ఆ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లు ఓడినా ఇప్పుడున్న జట్టు మెరుగ్గా ఆడుతోందని హెసన్ ప్రశంసించాడు. ఇదే జట్టు ఆసియా కప్‌కు ముందు ఈ నెల 29 నుంచి షార్జాలో అఫ్గానిస్తాన్, యూఏఈతో పాక్ ట్రై నేషన్స్ సిరీస్ ఆడనుంది.
పాక్ టీమ్: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుసేన్ తలట్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాద ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ మోకీమ్.