ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు: కేజ్రీవాల్

ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘ఢిల్లీలో కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ బారిన పడిన వారిలో 72 వేల మంది కోలుకున్నారు. యాక్టివ్‌గా ఉన్న 25 వేల కేసుల్లో 15 వేల మంది తమ ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు కూడా చాలా తగ్గింది. దేశంలోనే తొలిసారిగా మేం కరోనా ప్లాస్మా బ్యాంకును తెరిచాం. ప్లాస్మా థెరపీతో ఆరోగ్య స్థితి మోస్తరుగా ఉన్న వారు కోలుకుంటున్నారని మా ట్రయల్స్‌ ద్వారా ప్రూవ్ అయింది. అయితే ప్లాస్మా డొనేట్ చేయడానికి వస్తున్న వారి కంటే అవసరం ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అర్హత ఉన్న వారందరూ ప్లాస్మా డొనేట్ చేయాలని నేను కోరుతున్నా. దీని వల్ల ఎలాంటి బాధ, బలహీనత గానీ ఉండవు. ఎవరైతే ప్లాస్మా దానం చేస్తున్నారో వారు సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నట్లే’ అని కేజ్రీవాల్ చెప్పారు.