కేంద్రంలో కాంగ్రెస్​ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : గడ్డం వినోద్​

కేంద్రంలో కాంగ్రెస్​ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : గడ్డం వినోద్​

బెల్లంపల్లి రూరల్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మోసపూరిత పాలన చేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ విమర్శించారు. మంగళవారం వేమనపల్లి మండల కేంద్రంతో పాటు గొర్లపల్లి కొత్త కాలనీ, నీల్వాయి గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు రూ.400 చెల్లిస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్​రెడ్డి చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే చేయి గుర్తుకు ఓటేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు సాబీర్​ఆలీ, మాజీ సర్పంచ్​గాలి మధు తదితరులు పాల్గొన్నారు.