బీజేపీ నేతలది అసత్య ప్రచారం : మమతా బెనర్జీ

బీజేపీ నేతలది అసత్య ప్రచారం : మమతా బెనర్జీ

హరిశ్చంద్రపూర్ (బెంగాల్): కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్(యూసీ)పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ  యూసీలను సమర్పించలేదని విమర్శించారు. ఉత్తర మాల్దా లోక్ సభ పరిధి హరిశ్చంద్రపూర్ లో ‘దీదీ’ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘మా ప్రభుత్వం రూ.2.2 కోట్లను ఖర్చు చేసి వాటికి సంబంధించిన యూసీలను సమర్పించలేదని అమిత్ షా ఓ సభలో పేర్కొన్నారు. దానిని నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదంతా బూటకపు ప్రచారం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి యూసీని సమర్పించాం. అంతకు ముందు సీపీఎం పాలనలో జరిగిన వాటికి మాత్రం నేను బాధ్యత వహించను” అని తెలిపారు. 

ఉపాధి హామీ పనికి సంబంధించిన నిధులను నిలిపివేసి బెంగాల్ పై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటుందని మండిపడ్డారు. కేంద్రం ముందు తాము ఎప్పటికీ తలవంచబోమని అన్నారు. బెంగాల్​లో ఎన్​ఆర్​సీ, యునిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేయబోమని మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.