టెన్త్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి

టెన్త్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి

యాదాద్రి, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో యాదాద్రి జిల్లా స్టూడెంట్స్​90.44 శాతం మంది పాస్​అయ్యారు. స్టేట్​లో జిల్లా 25వ స్థానంలో నిలిచింది. పరీక్షలకు 9,108 స్టూడెంట్స్​హాజరు కాగా, 8,237 మంది పాస్ అయ్యారు. ఎప్పటిలానే ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ​68 మంది పదికి పది జీపీఏ సాధించారు. 75 స్కూల్స్​లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. కాగా, 871 మంది ఫెయిల్ అయ్యారు. 

 బాలికలే టాప్.. 

పది పరీక్షలకు 4,571 మంది బాలురు హాజరుకాగా, 4032(88.21 శాతం ) పాసయ్యారు. 4,557 మంది బాలికలు హాజరుకాగా 4205 (92.68) మంది పాసయ్యారు. వివిధ ప్రభుత్వ స్కూల్స్​స్టూడెంట్స్​6,507 మంది హాజరుకాగా, 5,721 మంది పాస్​అయ్యారు. అదే ప్రైవేట్​స్కూల్స్​కు చెందిన 2,601 మంది హాజరుకాగా, 2,516 మంది పాస్​ అయ్యారు. పదికి పది జీపీఏ సాధించిన 68 మందిలో 37 మంది ప్రైవేట్​ స్కూల్స్​కు చెందిన స్టూడెంట్స్​ఉన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 75 స్కూల్స్​లో 39 ప్రభుత్వ స్కూల్స్, 36 ప్రైవేట్​స్కూల్స్​ఉన్నాయి. 

రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా

సూర్యాపేట, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. ఓవరాల్ గా 96.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 97.12శాతం బాలికలు, 96.16 శాతం బాలురు పాస్​అయ్యారు. మొత్తం జిల్లాలో 11,910 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 11,542 మంది విద్యార్థులు పాస్​అయ్యారు. 368 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మొత్తంగా జిల్లాలో 96.91 శాతం ఉత్తీర్ణత సాధించారు.  

సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాలలు..  

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటాయి.  ఎయిడెడ్ పాఠశాలల్లో 98.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆశ్రమ పాఠశాలలో 94.81 శాతం, బీసీ వెల్ ఫేర్ పాఠశాలల్లో 99.65 శాతం, ప్రభుత్వ పాఠశాలలో 90.28 శాతం, కే‌‌‌‌‌‌‌‌జీ‌‌‌‌‌‌‌‌వీబీల్లో 95.28 శాతం, మోడల్ స్కూల్స్ 94.98 శాతం, రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 100 శాతం, సోషల్ వెల్ఫేర్​పాఠశాలల్లో 97.02 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 94.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

నల్గొండ అర్బన్​, వెలుగు : జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 19,263 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీళ్లలో బాలురు 9,61 5 మంది ఉత్తీర్ణులు కాగా (95.2శాతం), బాలికలు 8,898 (97.10శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.  జిల్లా వ్యాప్తంగా 96.11 శాతం ఉత్తీర్ణత నమోదైంది. స్టేట్​లో నల్గొండ జిల్లా 9వ స్థానంలో నిలిచింది.

జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు 101 ఉన్నాయి. 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ విద్యార్థులు 13 మంది ఉన్నారు. 231 స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేట్ స్కూళ్లు 97 ఉండగా, జిల్లా పరిషత్​ స్కూళ్లు 84, బీసీ వెల్ఫేర్ స్కూల్స్​13, కేజీబీవీలు10 ఉన్నాయి.