బీఆర్ఎస్ అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి : మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

బీఆర్ఎస్ అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి  :  మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

కార్మిక నాయకుడిగా చెప్పుకునే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. గోదావరిఖని 8వ కాలనిలోని అబ్దుల్ కలాం స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  అప్పుడున్న బీఆర్ఎస్ ఎంపీలు కవిత, బాల్క సుమన్ సింగరేణి ప్రైవేటీకరణకు ఓటు వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.  అవినీతి సొమ్ముతో  బీఆర్ఎస్ నాయకులు గోదావరిఖని చుట్టుపక్కల భూములు కొన్నారని ఆరోపించారు.  

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, బీఆర్ఎస్ అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి అని విమర్శించారు.   శ్రీరాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందన్నారు. కవితను జైలు నుంచి విడిపించుకోవడానికి బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దేశన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్దపల్లిలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.