‘హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటా’ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

‘హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటా’ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

జమ్మికుంట, వెలుగు: రాజకీయంగా జన్మనిచ్చి, ఎమ్మెల్సీగా నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటానని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం ఆయన పూజలు చేశారు. హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో కాంగ్రెస్​ బలపరచగా గెలిచిన సర్పంచ్​లను సన్మానించారు.  

హుజూరాబాద్ అభివృద్ధికి తన ఎమ్మెల్సీ నిధులను కేటాయిస్తానన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించడానికి భారీ మొత్తంలో ఖర్చు చేశాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ మెంబర్ కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రామారావు, నాయకులు మల్లయ్య, రాజేశ్వర్​రావు, రంజిత్, సలీం తదితరులు పాల్గొన్నారు.