స్వల్పంగా తగ్గిన కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర

స్వల్పంగా తగ్గిన కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర

దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధరపై రూ.19 తగ్గించాయి. మే 1 బుధవారం నుండి తగ్గించిన ధరలు అమలులోకి రానున్నట్లు తెలిపాయి. దీంతో  దేశ రాజధాని ఢిల్లీలో19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ రిటైల్ ధర  రూ. 1,745.50కు తగ్గింది. గతంలో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1764.50గా ఉంది. 

తగ్గిన ధరలతో ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో  కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర ఎలా ఉన్నాయంటే..

  • ముంబైలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1698.50గా ఉంది
  • చెన్నైలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1911గా ఉంది
  • కోల్ కతాలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1859గా ఉంది

గత నెలలోనూ ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్ల ధరపై రూ. 30.50 తగ్గించాయి. మార్చిలో రూ. 25.50, ఫిబ్రవరిలో రూ. 14 పెంచగా.. జనవరి 1న వాణిజ్య సిలిండర్ల ధరపై రూ. 1.50 స్వల్పంగా తగ్గించాయి.