పిల్లలకు వ్యాక్సిన్ అవసరం లేదు

పిల్లలకు వ్యాక్సిన్ అవసరం లేదు

న్యూఢిల్లీ: పన్నెండేళ్ల లోపు చిన్నారులకు టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్యానెల్ లోని ఓ సభ్యుడు చెప్పారు. డేటా ప్రకారం చూసుకుంటే.. పిల్లలకు వెంటనే వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇన్ ఇండియా (ఎన్టీఏజీఐ) మెంబర్ డాక్టర్ జయప్రకాశ్ ములియాల్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తమ ప్యానెల్ తెలియజేసిందన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి ఒక్క చిన్నారి కూడా చనిపోలేదని.. కాబట్టి వాళ్లకు అత్యవసరంగా టీకా ఇవ్వనక్కర్లేదని ఓ నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ములియాల్ పేర్కొన్నారు. 

‘ఇండియాలో ఇప్పటిదాకా కరోనా బారిన పడి మృతి చెందిన వారిలో12 ఏళ్ల లోపు చిన్నారి ఒక్కరు కూడా లేరు. క్యాన్సర్, లుకేమియాతోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల్లో కొందరు చనిపోయారు. వారిలో పలువురికి వైరస్ పాజిటివ్ గా తేలినా.. వారు చనిపోవడానికి కొవిడ్ మాత్రం కారణం కాదు’ అని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి ప్రొఫెసర్ కూడా అయిన ములియాల్ అన్నారు. పిల్లలకు టీకాలు ఇవ్వాలా లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తల కోసం: 

బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేసిండు

మోడీ పవర్లోకి వచ్చాకే మూక దాడులు

చెంచాగిరి చేసేందుకు పార్టీలో చేరలే