మోడీ పవర్లోకి వచ్చాకే మూక దాడులు

మోడీ పవర్లోకి వచ్చాకే మూక దాడులు

న్యూఢిల్లీ: మోడీ సర్కారుపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు మూక హత్యల ఘ‌ట‌న‌ల గురించి ఎవరూ వినేవారం కాద‌న్నారు. మోడీ స‌ర్కార్ కొలువుదీరక ముందు మూక దాడుల మాటే విన‌లేద‌ని రాహుల్ ట్వీట్ చేశారు. థ్యాంక్యూ మోడీజీ అనే హ్యాష్ ట్యాగ్ ను ఈ ట్వీట్ కు జత చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ లో సిక్కుల ప్రార్థనాలయమైన గోల్డెన్ టెంపుల్ ను అపవిత్రం చేశారని ఇద్దరు వ్యక్తులను కొందరు కొట్టి చంపిన ఘటన నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. 

మూక హత్యలకు రాజీవ్ తండ్రి లాంటోడు

మూక హత్యలకు రాజీవ్ గాంధీ తండ్రి లాంటి వారని రాహుల్ కు బీజేపీ నేత అమిత్ మాల‌వీయ కౌంటర్ ఇచ్చారు. సిక్కుల ఊచకోతను కాంగ్రెస్ సమర్థించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిక్కు పురుషుల మెడలకు కాలుతున్న టైర్లను చుట్టిందని, కాలువల్లో పడేసిన మృత దేహాలను కుక్కలు పీక్కుతిన్నాయని మాలయవీయ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో

కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు