కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

లక్నో: రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ చదివే కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తామని యూపీ సర్కారు ప్రకటించింది. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్, ఎండీ, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్లకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25న స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించింది. మొదటి విడతలో లక్నోలోని భారతరత్న అటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిహారీ వాజపేయి ఏకానా స్టేడియంలో లక్ష మంది ఫైనలియర్ స్టూడెంట్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉచితంగా వాటిని అందిస్తారని పేర్కొంది. ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 వేల స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, 40 వేల ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి డిజి శక్తి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే 38 లక్షల మంది యువత రిజిస్టర్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్ సెక్రటరీ చెప్పారు.