చిన్న పార్టీలను అధికారానికి దూరంగా ఉంచడమే బీజేపీ ఎజెండా 

చిన్న పార్టీలను అధికారానికి దూరంగా ఉంచడమే బీజేపీ ఎజెండా 

మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామినీ నెరవేర్చలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. చిన్న పార్టీలను అధికారానికి దూరంగా ఉంచడమే బీజేపీ ఎజెండా అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందని, కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని.. కానీ దానిని నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని ఎన్‌సిపి చీఫ్ బీజేపీపై విమర్శలు చేశారు. 

ఈ ఏడాది జూన్ లో ఏక్ నాథ్ షిండే తో సహా 39 మంది శివసేన  ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందని శరద్ పవార్ ఆరోపించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం పతనానికి కమలదళమే కారణమన్నారు. ఎన్సీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు అనిల్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్ లను వేర్వేరు మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ చేత అరెస్ట్ చేయబడి ప్రస్తుతంలో జైలులో ఉన్నారన్నారు.