- ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రొ.శోభ
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో మందులు, సర్జికల్ వస్తువుల కొరత ఏమాత్రం లేదని, నిరుపేద రోగులకు అన్ని రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నామని ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శోభ స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుల కోసం సప్లయర్స్ అసోసియేషన్ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం హాస్పిటల్లో అత్యవసర చికిత్సలకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల కోసం అదనపు నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు.
సప్లయర్లకు సంబంధించిన బకాయిల వివరాలను ప్రభుత్వానికి పంపించామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, మార్చురీలో దుర్వాసన సమస్యను నివారించేందుకు ఇటీవలే రెండు ఫ్రీజర్ బాక్సులు అందాయని, మరో పది రోజుల్లో మరిన్ని బాక్సులు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
