ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ చేసేవారికి నిరాశ

ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ చేసేవారికి నిరాశ

ఎఫ్‌డీలు లాభం లేదా?

ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు చూస్తున్న ఇన్వేస్టర్లు
15 ఏళ్ల కనిష్టానికి దేశపు పొదుపు రేటు

కోల్‌‌కతా: వడ్డీ ఆశించి బ్యాంకులలో ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లలో డబ్బులు పెట్టేవారికి నిరాశే కలుగుతోంది. ఎందుకంటే, ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రోజు రోజుకీ తగ్గిపోతోంది. కొన్ని సందర్భాలలో ఏకంగా సేవింగ్స్‌‌(ఎస్‌‌బీ) ఎకౌంట్‌‌పై ఇస్తున్న వడ్డీకి సమానంగా ఉంటోంది. బ్యాంకుల చేతిలో డబ్బు ఎక్కువగా ఉండటం, అప్పులు తీసుకునే వాళ్లు తక్కువగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు ఎఫ్‌‌డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయని పేర్కొంటున్నారు. దీంతో గత్యంతరం లేక రిస్క్‌‌తో కూడుకున్న డెట్‌‌ మార్కెట్‌‌ మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌, స్టాక్‌‌ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడులు వంటి వాటి వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు. ఏడు రోజుల ఎఫ్‌‌డీలపై వివిధ బ్యాంకులు చెల్లించే వడ్డీ ఎస్‌‌బీ ఎకౌంట్‌‌పై ఇస్తున్న వడ్డీ కంటే కొద్దిగానే ఎక్కువంటే పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు. అప్పులపై వసూలు చేసే వడ్డీ రేట్లకు అనుగుణంగా ఎఫ్‌‌డీలపై వడ్డీ రేట్లను బ్యాంకులు  సాధారణంగా సవరిస్తుంటాయి. మార్జిన్లను నిలబెట్టుకునేందుకే బ్యాంకులు ఇలా చేస్తాయి. ఎఫ్‌‌డీలపై వడ్డీ రేట్లు ఇలాగే పడిపోవడం కొనసాగితే ఇన్వెస్టర్లలో సందేహాలు కలిగే అవకాశం ఉంటుందని డీబీఎస్‌‌ బ్యాంక్‌‌ ఎకానమిస్ట్‌‌ రాధికా రావు చెప్పారు.

మార్చి 2020 తో ముగిసిన ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో డిపాజిట్ల గ్రోత్‌‌ 8 శాతానికి పడిపోయింది. అంతకు ముందు ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ (2018–19) లో ఈ గ్రోత్‌‌ 9 శాతంగా ఉండేది. ఈ ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ అంటే 2020–21 లోని మొదటి రెండు నెలల్లో  చూస్తే  డిపాజిట్ల గ్రోత్‌‌ రేటు 1.9 శాతానికి పరిమితమైంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిపోతుండటంతో, ఇన్వెస్టర్లు ఇప్పుడు ట్యాక్స్‌‌ ఫ్రీ బాండ్స్‌‌, సావరిన్‌‌ గోల్డ్‌‌ బాండ్స్‌‌, డెట్‌‌ మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ వైపు మళ్లుతున్నారని బార్‌‌క్లేస్‌‌ బ్యాంక్‌‌ ప్రైవేట్‌‌ క్లయింట్స్‌‌ హెడ్‌‌ సందీప్‌‌ దాస్‌‌ తెలిపారు.

డిపాజిట్లపై వడ్డీ రేట్లు పడిపోవడం దేశంలోని పొదుపుపై పడుతోంది. మన పొదుపు రేటు ఇప్పటికే 15 ఏళ్ల కనిష్టానికి చేరింది. 2018–19 ఫైనాన్షియల్‌‌ ఇయర్లో చూస్తే ఇండియా సేవింగ్స్‌‌ జీడీపీలో 30.1 శాతానికి తగ్గిపోయాయి. అంతకు ముందు 2011–12 లో ఇవి 34.6 శాతం, 2007–08 లో 36 శాతంగా ఉండేవి. ఇక హౌస్‌‌హోల్డ్‌‌ సేవింగ్స్‌‌ (గృహ పొదుపు) చూస్తే 2012 నాటి 23 శాతం నుంచి 2018–19 నాటికి 18 శాతానికి పడిపోయాయి. ఫైనాన్షియల్‌‌ మార్కెట్లలో అనిశ్చితి కారణంగానే ఎఫ్‌‌డీలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయని, బ్యాంకులు అప్పులు ఇవ్వకుండా వాటి లిక్విడిటీ పెంచడం వల్ల స్టాట్యుటరీ లిక్విడిటీ హోల్డింగ్స్‌‌ పెరుగుతాయని ఐఐఎం కోల్‌‌కతా ఎకనమిక్స్‌‌ ప్రొఫెసర్‌‌ పార్థా రే చెప్పారు.

For More News..

సెకెండ్ హ్యాండ్ కార్లకు ఫుల్ గిరాకీ

కరోనా దెబ్బకు జాడ లేకుండా పోయిన జాబులు

కరోనా టెన్షన్.. పుకార్లతో పరేషాన్

సలైవా వాడితే 5 రన్స్‌ పెనాల్టీ