మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ కంపెనీల రిజల్ట్స్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌

మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ కంపెనీల రిజల్ట్స్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌

న్యూఢిల్లీ:  ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ కంపెనీల రిజల్ట్స్‌‌‌‌, గ్లోబల్ అంశాలు, మాక్రో ఎకనామిక్ డేటా నిర్ణయించనున్నాయి. ట్రేడర్లు విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల కదలికలు, రూపాయి–డాలర్ ట్రెండ్‌‌‌‌, బ్రెంట్‌‌‌‌ క్రూడ్ ధరపై ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఈ వారం హీరో మోటోకార్ప్‌‌‌‌, ఎల్‌‌‌‌ అండ్ టీ, బీపీసీఎల్‌‌‌‌, స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, ఐషర్ మోటార్స్‌‌‌‌, టాటా మోటార్స్‌‌‌‌ తమ మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌ను ప్రకటించనున్నాయి. 

మూడో దశ లోక్ సభ ఎన్నికలు  ఈ నెల 7 న జరగనున్నాయి. పీఎంఐ సర్వీసెస్‌‌‌‌ డేటా,  మార్చి నెల ఇండస్ట్రియల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ డేటా శుక్రవారం విడుదల కానున్నాయి.  కోటక్ బ్యాంక్‌‌‌‌, డీమార్ట్‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌కు, యూఎస్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్ డేటాకు సోమవారం మార్కెట్  స్పందించనుందని మోతీలాల్‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌  పేర్కొంది. యూరోజోన్‌‌‌‌  నుంచి జీడీపీ నెంబర్లు, బ్యాంక్ ఆఫ్​ ఇంగ్లండ్‌‌‌‌ పాలసీ మీటింగ్‌‌‌‌పై మార్కెట్ ఫోకస్ ఉంటుందని అంచనా వేసింది.