మరో 24 గంటల్లో ముగుస్తున్న కార్తీక మాసం : వ్రతం పాటించిన నాన్ వెజ్ ప్రియులకు రిలీఫ్

మరో 24 గంటల్లో ముగుస్తున్న కార్తీక మాసం : వ్రతం పాటించిన నాన్ వెజ్ ప్రియులకు రిలీఫ్

కార్తీకమాసంలో ఆచారాలు.. సంప్రదాయాలతో .. నాన్​ వెజ్​ కు దూరంగా ఉన్నవారికి గుడ్​న్యూస్​. .. ..ఆధ్యాత్మిక మాసం.... కార్తీకమాసం మరో 24 గంటల్లో అంటే నవంబర్​ 20 వ తేదీతో ముగియనుంది.  ఈ నెల రోజులు  వ్రతాలు.. పూజలు.. నదీస్నానాలు.. దీపారాధనలు.. ఉపవాసాలు చేసి భగవంతుని సేవలో ఎక్కువ సమయం గడిపారు.  ఈ సమయంలో మద్యపానం.. మాంసాహారానికి చాలా మంది  దూరంగా ఉన్నారు. నవంబర్ 20 .. కార్తీకమాసానికి ఆఖరి రోజు కావడంతో  నవంబర్​ 21 శుక్రవారం నుంచి నాన్​ వెజ్​ ప్రియులకు రిలీఫ్ దొరికింది.  

కార్తీకమాసం నెలరోజుల పాటు ఎంతో నిష్టగా.. నియమాలతో దీక్ష చేసి.. వ్రతాలు ఆచరించిన వారు  నాన్​ వెజ్​ ముట్టుకోరు. అలాంటి వారందరు వారి దీక్షను  నవంబర్​ 20 వ తేది అమావాస్యతో ముగియనుంది.  ఎప్పుడెప్పుడా.. అని చికెన్​ ముక్క కోసం ఎదురుచూస్తున్న వారికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. నెల రోజులు చప్పటి ఫుడ్​ తిన్నవారు .. ముక్క లేకుండా కడుపునింపుకున్న వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  సంప్రదాయాలు... ఆచారాల పేరిట నోరును కట్టుకున్నారు.  నవంబర్​ 20తో కార్తీకమాసం ముగియడంతో  మళ్లీ సండే .. హాలిడేస్​ లో నాన్​ వెజ్​ కు గిరాకీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కార్తీక మాసంలో మాంసం తినకూడదు అని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేకపోయినా హిందువులు నాన్​ వెజ్​ కు దూరంగా ఉంటారు. మాంసం తినకపోవడం అనేది పూర్తిగా ఒక సంప్రదాయం మాత్రమే. ఈ సంప్రదాయాన్ని పాటించడం ... పాటించకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధాపడి ఉంటుంది. కార్తీక మాసంలో ఇప్పటికీ మాంసం తినే వాళ్ళు ఉంటారు. అందుకే కార్తీకమాసంలో మాంసం తినడం వల్ల ఎలాంటి హాని జరగదు.  నిజానికి మాంసం తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదు. మాంసంలో పుష్కలంగా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.