భయపడతరా.. ఎంజాయ్​ చేస్తరా!

భయపడతరా.. ఎంజాయ్​ చేస్తరా!

1982.. ఇది సంవత్సరం కాదు. ఓ కొండ ఎత్తు. ఆ కొండ చుట్టూ ఇంకొన్ని కొండలు. వాటి మధ్య లోయల్లో పారే నీళ్లు. ఎంత అందంగా ఉంటుందో కదా ప్రకృతి. ఆ అందంలోనే భయమూ ఉంటుంది మరి. నార్వేలోని ప్రీకెస్టోలెన్​ అనే ప్రాంతంలో అంత పెద్ద కొండపై కట్టేందుకు డిజైన్​ చేసిన హోటల్​ నమూనా ఇది. టర్కీకి చెందిన హయరీ అతక్​ అనే కంపెనీ ఈ హోటల్​కు డిజైన్​ చేసింది. కొండంచుకు నాలుగు ఫ్లోర్లలో ఈ హోటల్​ నిర్మాణం ఉంటుందట.

కింది ఫ్లోర్​లో బయటకు చొచ్చుకొచ్చేలా పొడవాటి స్విమ్మింగ్​పూల్​ ఉంటుంది. అది కూడా అడుగు భాగం నుంచి కింద ఉన్న ప్రాంతమంతా కనిపించేలా అద్దంతో డిజైన్​ చేశారు. ఇక, ప్రతి ఫ్లోర్​లోనూ కొండ అంచు నుంచి బయటకొచ్చేలా బాల్కనీలూ ఉంటాయట. కాబట్టి వచ్చే గెస్టులు తనివితీరా ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలనూ మొత్తం చూసేందుకు వీలుగా టాప్​ ఫ్లోర్​లో డెక్​ ఏర్పాటు చేస్తారట. ఇప్పటికైతే ఇది కేవలం డిజైన్​కు పరిమితమైంది. ఎప్పుడు కట్టేది, అసలు కడతారా కట్టరా అనే దానిపై కంపెనీ నుంచి ఎలాంటి పలుకూ లేదు. చూద్దాం, ఇది ఎప్పుడు నిజంగా నిజమవుతుందో!!!