ఆసియా క్రీడలు (Asian Games 2026) పురుషుల T20 క్రికెట్ సెమీఫైనల్స్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపింది. శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా ఏకంగా 124 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్ స్వర్ణ పతకం (Gold Medal Match) కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్:
టాస్ గెలిచి శ్రీలంక జట్టు ఫీల్డింగ్ తీసుకోగా, భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ, వికెట్ పడుతున్న వేళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కిషన్ కేవలం 46 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మరోవైపు, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగి 38 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
పేకమేడలా కూలిన లంక బ్యాటింగ్ :
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే లంక బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపారు. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలడంతో, భారత్ 124 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఫస్ట్ ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన స్పెల్ ధాటికి లంక బ్యాటర్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు వచ్చింది. ఈ క్రమంలో 9.5 ఓవర్లలోనే శ్రీలంక కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకే ఆలౌట్ అయింది.
స్వర్ణ పతక పోరులో భారత్ vs పాకిస్థాన్:
ఈ సెమీఫైనల్ విజంతో ఆసియా క్రీడల గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ దాయాదుల పోరు శనివారం (అక్టోబర్ 3న) జరగనుంది. టోర్నమెంట్లో విజయవంతంగా దూసుకుపోతున్న టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకునేందుకు సర్వసన్నద్ధమవుతోంది.
𝗪 𝗪 𝗪 to finish things off ☝️☝️☝️#TeamIndia strike thrice is as many deliveries to secure a massive win and reach the Gold Medal contest 🥳
— BCCI (@BCCI) October 1, 2026
Scorecard ▶️ https://t.co/DjHV9q6htT#AsianGames pic.twitter.com/P4kb2TXIRE
