Gautam Gambhir: గువాహటి వేదికగా బుధవారం (సెప్టెంబర్ 30) వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ, భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిమానులు చూసింది అసలు క్రికెట్ కాదని, అది కేవలం బ్యాటింగ్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. బౌలర్లకు కూడా తగినంత అవకాశం లభించేలా బ్యాట్, బాల్ మధ్య పోటీని తీసుకురావాలని బీసీసీఐని, రాష్ట్ర క్రికెట్ బోర్డులను గంభీర్ కోరారు.
బౌలర్ల పట్ల సానుభూతి అవసరం:
ఇలాంటి ఫ్లాట్ పిచ్‌లపై యువ బౌలర్లు బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని కోచ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. రికార్డుల పరంగా, ప్రేక్షకులు, బ్రాడ్‌కాస్టర్ల పరంగా ఇది అద్భుతంగా ఉన్నప్పటికీ, ఒక కోచ్‌గా, క్రికెట్ అభిమానిగా తాను బౌలర్ల ఇబ్బందిని అర్థం చేసుకోగలనని పేర్కొన్నాడు. ఐదుగురు ఫీల్డర్లు లోపల ఉండటం, రెండు కొత్త బంతులను ఉపయోగించడం, ప్రస్తుత పవర్‌హిట్టింగ్ శైలి కారణంగా బౌలర్లకు సరైన ఆప్షన్లు లేకుండా పోతున్నాయని ఆయన తెలిపాడు. కేవలం గణాంకాలను బట్టి బౌలర్లను తప్పుపట్టలేమని, వారు సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారిని సపోర్ట్ చేయాలని గంభీర్ స్పష్టం చేశారు.
2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలే లక్ష్యం:
ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఆకిబ్ నబీతో పాటు గుర్నూర్ బ్రార్ వంటి యువ బౌలర్లను ఒత్తిడి పరిస్థితుల్లో ఆడించడం భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగమని గంభీర్ వెల్లడించారు. 2027 వన్డే ప్రపంచకప్‌నకు మరో ఏడాది మాత్రమే సమయం ఉందని, ఐపీఎల్, ఆస్ట్రేలియా సిరీస్ పోను భారత్‌కు కేవలం 20 వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రత్యామ్నాయాలను పరిశీలించి, జింబాబ్వే సిరీస్ వరకు కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామని గంభీర్ తెలిపారు. భారత్ - వెస్టిండీస్ మధ్య మూడో వన్డే శనివారం (అక్టోబర్ 3) నాడు చండీగఢ్‌లో జరగనుంది.
THIS WASN'T A CRICKET MATCH, IT WAS A BATSMAN'S PICNIC!"
— Anil Bansal (@dilseanilbansal) September 30, 2026
Team India Head Coach Gautam Gambhir has dropped an absolute truth-bomb regarding flat wickets, standing up like a wall for his bowlers after a high-scoring ODI encounters!
Gautam Gambhir's Hard-Hitting Statements:The… pic.twitter.com/imWLCJPw9V
